పోసాని కృష్ణ మురళిపై మరో కేసు నమోదు

77చూసినవారు
పోసాని కృష్ణ మురళిపై మరో కేసు నమోదు
AP: ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మద్దతుదారుడు పోసాని కృష్ణ మురళికి మరో షాక్ తగిలింది. బుధవారం ఆయనపై బాపట్ల పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు నమోదైంది. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బీఆర్ నాయుడుపై పోసాని అసభ్యకర వ్యాఖ్యలు చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు బాపట్ల పోలీసులు పోసానిపై కేసు నమోదు చేశారు. పోసానిపై ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులు రాగా 18 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్