ఏపీకి మరో వాయుగుండం ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి ఏపీ, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమలో భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. వాయుగుండంగా మారిన తర్వాత ఈనెల 27న తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.