హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో జింక మృతి చెందింది. కుక్కలు తరుముగా నీళ్లలో పడిపోయి జింక మృతి చెందింది. యూనివర్సిటీ ప్రాంగణంలో చెట్లను కొట్టివేయడంతో వన్యప్రాణులు ఆవాసాలను వెతుక్కుంటూ బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో మరణించినట్లు విద్యార్థులు తెలుపుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ పోలీసులు, యూనివర్సిటీ సిబ్బంది జింకను బయటికి తీసి పాతిపెట్టారు. మొత్తంగా ఇప్పటి వరకు నాలుగు జింకలు మృతి చెందినట్లు తెలిపారు.