చైనా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ‘హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్’ వంతెనను జూన్‌లో ప్రారంభించనుంది. గుయ్‌ఝౌ
ప్రాంతంలోని బీపన్ నదిపై 2050 అడుగుల ఎత్తులో ఈ బ్రిడ్జిని నిర్మించారు. 2022లో దీని నిర్మాణాన్ని ప్రారంభించగా.. కేవలం మూడేళ్లలోపే పూర్తి చేశారు. దీని నిర్మాణానికి రూ.2400 కోట్లు ఖర్చు పెట్టారు. ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్ల ఎత్తు, మూడు రెట్ల బరువుతో దీన్ని నిర్మించారు. దీంతో గంట ప్రయాణం ఒక్క నిమిషంలోనే పూర్తవుతుందంట.