ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మరో గుడ్‌న్యూస్.. అదనంగా రూ.లక్ష సాయం!

78చూసినవారు
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మరో గుడ్‌న్యూస్.. అదనంగా రూ.లక్ష సాయం!
TG: 'ఇందిరమ్మ ఇళ్ల' పథకం కింద ఇప్పటికే లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించనున్న విషయం తెలిసిందే. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ ఇళ్లపై మరో గుడ్ న్యూస్ చెప్పారు. రూ.5 లక్షలతో పాటు అదనంగా రూ.లక్ష రుణం ఇప్పిస్తామని తెలిపారు. ఇళ్లు నిర్మించుకునే స్థోమత లేనివారికి మహిళా సంఘాల ద్వారా ఈ ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

సంబంధిత పోస్ట్