త్రిపురలో మేఘాలయ హనీమూన్ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అగర్తలాకి చెందిన షరిఫుల్ అనే యువకుడి హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. దిబాకర్ సాహా, షరిఫుల్, ఓ మహిళ.. వీరి ట్రయాంగిల్ లవ్‌స్టోరీ హత్యకు దారి తీసినట్లు తెలిపారు. తాను ప్రేమించిన మహిళను దక్కించుకోవడం కోసం షరిఫుల్‌ని, దిబాకర్ అతని ఫ్రెండ్స్ గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని అతని తండ్రి దుకాణంలోని ఐస్‌క్రీం ఫ్రీజర్‌లో దాచారు. దిబాకర్ తల్లిదండ్రులు సహా మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.