మయన్మార్‌లో ఆదివారం ఉదయం 5.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. 35KM లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు EMSC తెలిపింది. కాగా, ఇటీవల 7కి పైగా తీవ్రతతో భారీ భూకంప సంభవించడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఆ భూకంపంలో 4 వేలకు పైగా మృతిచెందారు. వేలాది మంది గాయపడ్డారు. తాజాగా మరోసారి పలుచోట్ల భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.