TG: ములుగు జిల్లాలోని మల్లంపల్లిని కొత్త మండలంగా ప్రకటిస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఎన్నికల సమయంలో మంత్రి సీతక్క మండలం ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో మల్లంపల్లి, రామచంద్రాపూర్ గ్రామాలతో ఈ మండలం ఏర్పాటు చేశారు. ములుగు రెవెన్యూ డివిజన్, జిల్లా పరిధిలోనే ఈ గ్రామం కొనసాగనుంది. పదేళ్లుగా స్థానికులు చేసిన పోరాటానికి ఫలితం దక్కిందంటూ సీఎం రేవంత్ కు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.