మరో కొత్త పథకం.. 'ఇందిరా సౌరగిరి జలవికాసం'

61చూసినవారు
మరో కొత్త పథకం.. 'ఇందిరా సౌరగిరి జలవికాసం'
TG: రాష్ట్రంలో గిరిజనుల కోసం రేవంత్ సర్కార్ ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం ప్రారంభిచనుంది. నాగర్‌కర్నూల్‌(D) మన్ననూరులో సీఎం రేవంత్‌ ఈ నెల 18న ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టం కింద కేటాయించిన భూములను పూర్తిస్థాయిలో సాగులోకి తీసుకురావాలని నిర్ణయించారు. రూ.12,600 కోట్లతో ఈ పథకాన్ని చేపడుతున్నట్లు ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 2.10 లక్షల మంది రైతులకు 6 లక్షల ఎకరాల్లో సాగునీటిని అందిచవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్