TG: గ్రామ పాలన అధికారుల(జీపీవో) ఎంపికకు పూర్వ VRO, VRAలకు మరో అవకాశం కల్పించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన పరీక్షతో 3,454 మంది జీపీవోలుగా అర్హత సాధించారని తెలిపారు. వీఆర్‌ఏ, వీఆర్వోలకు మరోసారి అర్హత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అవసరమైతే VRAల నుంచి జూనియర్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరించిన వారిని GPO పోస్టుల వైపు మళ్లించడాన్ని పరిశీలిస్తామని అన్నారు.