తిరుమల శ్రీవారి ఆలయం ముందు మరోసారి ఫొటో షూట్ వివాదం చోటుచేసుకుంది. బళ్లారి సిటీ
కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఫొటో షూట్ చేయడం వివాదం రేపింది. ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి బావమరిదికి హీరో నితిన్ మేనకోడలితో నిన్న తిరుమలలో నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా నారా భరత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉదయం శ్రీవారి దర్శనానికి వచ్చి తమ ఫోటోగ్రాఫర్లతో ఫొటోలు తీయించుకోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.