బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. యూకేలోని ప్రముఖ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ కేంద్రాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానం లభించింది. దీంతో ఈ నెల 30న ప్రపంచంలోని అతిపెద్ద ఆటో బ్రాండ్లకు సేవలు అందించే పీడీఎస్‌ఎల్ కంపెనీ పరిశోధన కేంద్రాన్ని ఆయన ప్రారంభించనున్నారు.