రేపు మరోసారి నిర్మాతల సమావేశం!

72చూసినవారు
రేపు మరోసారి నిర్మాతల సమావేశం!
హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లతో నిర్మాతలు నిర్వహించిన సమావేశం ముగిసింది. థియేటర్ల బంద్‌ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారిని ఈ సందర్భంగా నిర్మాతలు కోరారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై గురువారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. రేపటి సమావేశంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుందామని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్