హనీమూన్ తీసుకెళ్లి భర్తను చంపిన కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సోనమ్ తన భర్త రాజా రఘువంశీని చంపేందుకు అంతకుముందు 3సార్లు ప్రయత్నించిందని ఎస్పీ సయీమ్ తెలిపారు. మొదటిసారి గువాహటిలో, తర్వాత రెండుసార్లు మేఘాలయలోని సోహ్రాలో ప్రయత్నించి విఫలమైనట్లు చెప్పారు. సావ్‌డాంగ్‌లో నాలుగో అటెంప్ట్‌లో రాజాను హత్య చేసినట్లు చెప్పారు. కాగా ఈ కేసులో సోనమ్, ఆమె లవర్ రాజ్ కుశ్వాహా, మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు.