ఉత్తరప్రదేశ్‌లో వందేభారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. డెహ్రాడూన్ నుంచి ఆనంద్ విహార్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ దాడితో రైలు అద్దాలు పగిలిపోయాయి. మీరట్ నుండి మోదీనగర్‌కు వస్తుండగా ఈ స్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల ముందుగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ప్రాంతంలో వందే భారత్ పై దాడి చేయడం ఇది నాలుగోసారి.