ఫీజుల ఒత్తిళ్లు తాళలేక నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే అనంతపురంలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సత్యసాయి జిల్లా మలకాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్(17) ఎస్‌ఆర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఒత్తిడి భరించలేక కళాశాల వెనుకవైపున్న దానిమ్మ తోటలోని వేపచెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడంటూ మృతదేహంతో కళాశాల ఎదుట పేరెంట్స్ నిరసన చేపట్టారు.