ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి

62చూసినవారు
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి
TG: రాష్ట్రంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి అయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయిపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ (20) అనే యువకుడు కారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గత మూడేళ్లుగా బెట్టింగ్‌కు బానిసగా మారి స్నేహితులు, తెలిసిన వారి దగ్గర దాదాపు రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. కుటుంబ సభ్యులు ఈ విషయం తెలుసుకుని వంశీని మందలించారు. దీంతో మనస్తాపానికి గురై పొలం వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్