అనుష్క శెట్టి అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె ప్రధానపాత్రలో నటిస్తోన్న ‘ఘాటి’ సినిమా మరోసారి వాయిదా పడింది. వేసవి కానుకగా ఏప్రిల్ 18న దీనిని విడుదల చేయాలని టీమ్ తొలుత భావించింది. అయితే అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. దీంతో జులై 11న విడుదల చేస్తామని టీమ్ ప్రకటించినప్పటికీ మరోసారి వాయిదా వేసింది. వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ కారణంగా ఇది వాయిదా పడినట్లు సమాచారం.