ఏపీ ప్రభుత్వం జారీ చేసే ఎస్సీ కాస్ట్ సర్టిఫికెట్‌తో తెలంగాణలో రిజర్వేషన్లు పొందలేరని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. పీజీ మెడికల్ సీట్లలో రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను విచారించింది. టీజీ ప్రభుత్వం జారీ చేసిన SC సర్టిఫికెట్ ఉన్న వాళ్లే ఇక్కడ రిజర్వేషన్‌కు అర్హులని వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏపీ SC కాస్ట్ సర్టిఫికెట్ పత్రం TGలో చెల్లదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో సీజే ధర్మాసనం ఏకీభవించింది.