వేల కోట్ల రూపాయల విలువైన ఏపీ మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి పాత్ర, ప్రమేయం మరోమారు తెరపైకి వచ్చింది. జగన్ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలకు లంచాలు చెల్లించేందుకు అంగీకరించినవారికే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టడం, వారి నుంచి ముడుపులు వసూలు చేయడం లాంటి బాధ్యతలు కసిరెడ్డే నిర్వహించేవారని ప్రధాన అభియోగం. విజయసాయిరెడ్డి సైతం కసిరెడ్డి పేరు చెప్పడంతో ఆయన ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు.