AP: 'ప్లీజ్ నాన్న.. మమ్మల్ని చంపొద్దు'

80చూసినవారు
AP: 'ప్లీజ్ నాన్న.. మమ్మల్ని చంపొద్దు'
ఏపీలో కన్నకూతుళ్లను తండ్రే కడతేర్చిన దారుణ ఘటన చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా పనికుంటకు చెందిన నాగాంజనేయ శర్మ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుందామనుకుని తన ఇద్దరు కూతుళ్లు యామిని(10), కావ్య(7) తో పాటు కాలువలో దూకాడు. దీంతో ఊపిరాడక చిన్న కూతురు చనిపోగా.. ఈత వచ్చిన తండ్రి కాలు పట్టుకుని పెద్ద కూతురు బతిమాలింది. "నాన్నా, మమ్మల్ని చంపొద్దు. నీ కాళ్లు పట్టుకుంటా నాన్నా" అంటూ వేడుకుంది. కానీ ఏమాత్రం చలించని శర్మ బిడ్డను వదలించుకుని కాలువలో నుంచి బయటకు వచ్చాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్