‘ముందెళ్లి క్షమాపణ చెప్పండి’.. మంత్రికి సుప్రీం ఆర్డర్

74చూసినవారు
‘ముందెళ్లి క్షమాపణ చెప్పండి’.. మంత్రికి సుప్రీం ఆర్డర్
ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి మీడియాకు వివరాలను వెల్లడించిన కర్నల్ సోఫియా ఖురేషీని “ఉగ్రవాదుల సోదరి”గా వ్యాఖ్యానించిన మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు మండిపడింది. ఆయన వ్యాఖ్యలపై MP హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ కేసులో మంత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆయన తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ “ఇలాంటి విషయాల్లో సున్నితంగా వ్యవహరించాలి. ముందెళ్లి హైకోర్టులో క్షమాపణ చెప్పండి” అని ఆదేశించింది.