అమెరికా కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్న 185 మంది ఉద్యోగులను యాపిల్ సంస్థ తొలగించింది. ఛారిటీ నిబంధనలను దుర్వినియోగం చేసిన ఉద్యోగులను తీసేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అనుమతించే కార్యక్రమాన్ని ఉద్యోగులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు రావడంతో ఈ చర్యలు చేపట్టినట్లు సంస్థ తెలిపింది.