రేపటి నుంచి లైసెన్స్‌డ్‌ సర్వే అభ్యర్థులకు దరఖాస్తులు

66చూసినవారు
రేపటి నుంచి లైసెన్స్‌డ్‌ సర్వే అభ్యర్థులకు దరఖాస్తులు
TG: రాష్ట్రంలో భూభారతి చట్టం అమలులో భాగంగా..  కర్ణాటకలో విజయవంతమైన లైసెన్స్‌డ్‌ సర్వే విధానాన్ని తెలంగాణలో అమలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొత్తం 5 వేల మంది సర్వేయర్లను ఈ విధానంలో తీసుకుంటామని చెప్పారు. రేపటి నుంచి (మే 17) దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ సర్వే అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్