అనాథ యువతులకు పెళ్లి చేయడానికి రాజస్థాన్ ప్రభుత్వం 'జీవన్ పునర్వాస్' పేరుతో దరఖాస్తులు ఆహ్వానించింది. 11 మంది అమ్మాయిలను వివాహం చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్న 1900 మందికి అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. నెలల తరబడి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేశారు. చివరికి జైపూర్ నుంచి ఆరుగురు, దిద్వానా కుచమన్ నుంచి ఇద్దరు, ఝుంఝును, కోట, బరాన్ నుండి ఒక్కొక్కరిని ఎంపిక చేశారు. వీరు త్వరలో ఆ యువతులను పెళ్లి చేసుకోనున్నారు.