ప్రధాన మంత్రి కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకుంటే పెట్టుబడి సాయం అందజేస్తామని కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ తెలిపారు. అర్హులైన రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా కేంద్రం ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.6వేలు మూడు విడతల్లో అందిస్తోంది. ఈ ఏడాది తొలి విడత నిధులను ప్రధాని మోదీ గత నెల 24న విడుదల చేశారు. పీఎం కిసాన్ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి.