కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే పురస్కారాలైన పద్మ పురస్కారాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. 2026 సంవత్సరానికి ఇచ్చే ఈ పద్మ అవార్డుల కోసం నామినేషన్లు/సిఫార్సులను రాష్ట్రపతి పురస్కార్ పోర్టల్ https://awards.gov.in ద్వారా స్వీకరిస్తారు. నామినేషన్లను జులై 31 లోగా పైన పేర్కొన్న పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఫార్మాట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.