తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నూతన రేషన్ కార్డుల కోసం మీసేవలో దరఖాస్తు చేయడానికి పౌర సరఫరాల శాఖ వెసులుబాటు కల్పించింది. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. కాగా, గ్రామ సభల ద్వారా రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించి.. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26 తేదీన 15,414 కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేసిన విషయం తెలిసిందే.