త్వరలో జూనియర్ లెక్చరర్లను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రెండేళ్ల కిందటే 1392 పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. సెలక్ట్ అయిన అభ్యర్థుల జాబితాను ఇంటర్ కమిషనరేట్‌కు అప్పగించింది. మల్టీజోన్-1లో 581 మంది, జోన్-2లో 558 మంది ఉన్నారు. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తికాగా వీరికి వారంలోగా నియామక పత్రాలు ఇచ్చి కాలేజీల్లో భర్తీ చేయనున్నారు.