తెలంగాణలో మరో ఆరు మార్కెట్ యార్డులకు ప్రభుత్వం పాలకవర్గాలను నియమించింది. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్, కమ్మర్‌పల్లి, వేల్పూరు, కరీంనగర్ జిల్లాలో గోపాల్‌రావు పేట, రాజన్నసిరిసిల్ల జిల్లాలో బోయిన్‌పల్లి, కామారెడ్డి జిల్లాలో బిక్కనూరు మార్కెట్ యార్డులకు పాలకవర్గాలను నియమించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 70 మార్కెట్లకు పాలకవర్గాల నియామకం జరిగిందని పేర్కొన్నారు.