తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) సర్వేకు అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున CM రేవంత్‌ను కలిసి అభినందనలు తెలియజేశారు. PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం, పొంగులేటి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, వెనుకబడిన తరగతులకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ చాంబర్ లో సీఎంను కలిసి విష్ చేశారు.