కేటీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 'X' వేదికగా విమర్శించారు. 'రైతుల విషయంలో మీకు, మాకు పోలికా? వరి వేస్తే ఉరే అన్న మీరెక్కడ? రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ధాన్యం రికార్డు సృష్టించిన మేమెక్కడ? రైతులకు రూ.లక్ష రుణమాఫీ అని చెప్పి ఐదేండ్లు వంచించిన మీరెక్కడ? ఏడాదిలోపే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన మేమెక్కడ? మీ పదేండ్ల అరాచకం అంతా ప్రజలకు తెలుసు. అందుకే అసెంబ్లీలో జాడిచ్చి తన్ని, పార్లమెంటులో పాతరేసిర్రు' అని మండిపడ్డారు.