పెదాలపై, గడ్డంపై వెంట్రుకలతో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. వీటి కోసం కొన్ని ఇంటి చిట్కాలు ట్రై చేయవచ్చని నిపుణులు చెప్తున్నారు. 1 టేబుల్ స్పూన్ పంచదార, కొద్దిగా నిమ్మరసం, నీరు కలిపి జెల్లీలా చేసి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత కడగాలి. వారంలో 2–3 సార్లు చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే, శనగ పిండి, పెరుగు, పసుపు కలిపి ప్యాక్‌గా వేసి ఆరిన తర్వాత మసాజ్ చేస్తూ తొలగించాలి. ఇది కూడా బాగా పనిచేస్తుందట.