కూరలు, వేపుళ్లు ఇలా ఏ వంటకమైనా చాలా మంది ఇనుప కడాయిలో చేస్తుంటారు. అయితే, టమాటా, చింతపండు, నిమ్మకాయలు వాడి చేసే వంటలు ఇనుప కడాయిలో చేయకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఎసిడిక్ గుణాలు ఉండడం వల్ల అవి ఇనుముతో రియాక్ట్ అయ్యి.. ఆ లోహం కరిగి వంటలో కలుస్తుందంటున్నారు. ఇవేకాకుండా వంకాయ, పాలకూర, గుడ్డు, బీట్‌రూట్ కూడా ఇనుప మూకుడులో వండకూడదని అంటున్నారు.