బిర్యానీ తింటూ కూల్‌డ్రింక్ తాగుతుంటారు చాలామంది. తొందరగా జీర్ణం అవుతుందని అపోహపడతారు. అప్పటికి చిల్ అనిపించినా దానివల్ల అనారోగ్యం బారిన పడతామని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కూల్ డ్రింక్స్ వల్ల జరిగే కార్బొనేషన్ జీర్ణప్రక్రియను దెబ్బతీస్తుందని తెలిపారు. అధిక మొత్తంలో ఉండే చక్కెరతో బరువు పెరుగుతారని చెప్పారు. కూల్ డ్రింక్స్ బదులు మజ్జిగ తీసుకుంటే ఉత్తమమని సూచిస్తున్నారు.