పండుగల సమయంలో మహిళలు ఎక్కువగా ఉపవాసం చేస్తుంటారు. అయితే ఉపవాసం ముగిసిన తర్వాత ఒక్కసారిగా అధిక మొత్తంలో భోజనం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉపవాసం తర్వాత ఎక్కువ చక్కెర ఉన్న పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారం తినడం మంచిది కాదని సూచిస్తున్నారు. అలాగే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుందని, అందువల్ల లిక్విడ్స్ తీసుకోవడం మంచిదంటున్నారు. అలాగే పొటాషియం ఉన్న పదార్థాలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మంచిగా పని చేస్తుందట.