ఓట్స్ అధికంగా తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా ఓట్స్ తినే వారిలో కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయని, అలాగే జీర్ణ సమస్యలకు దారితీస్తాయని చెబుతున్నారు. ఇందులోని ఫైటిక్ యాసిడ్, క్యాల్షియం, ఇనుము, జింక్ వంటి కొన్ని ఖనిజాల శోషణను నిరోధిస్తుందని, దీనితో మలబద్ధకం లాంటి సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే ప్రోటీన్ కారణంగా అలర్జీలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందన్నారు.