ఒక వ్యక్తి పగటిపూట ఎనిమిది సార్లు, రాత్రిళ్లు రెండుసార్లకుపైగా మూత్ర విసర్జన చేస్తే అది సమస్యగానే భావించాలి. తక్కువ విసర్జనతో పాటు శరీర వాపు, అలసట, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నా డాక్టర్‌ను సంప్రదించాలి. అదే విధంగా, రోజుకు నాలుగు సార్లకంటే తక్కువ విసర్జనైతే డీహైడ్రేషన్ ప్రమాదం ఉండవచ్చు. ఎక్కువగా నీరు, టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్, ఆల్కహాల్ తీసుకున్నా విసర్జన సంఖ్య పెరుగుతుంది.