ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేకపోతే నిమిషం కూడా గడవని పరిస్థితి ఉంది. స్మార్ట్ ఫోన్లు అధికంగా ఉపయోగించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. దీంతో ఇబ్బందులు వస్తాయి.ఫోను నుంచి వచ్చే కిరణాలు కళ్లకే కాదు మెదడు కణాలను కూడా దెబ్బతీస్తుంది. స్మార్ట్ ఫోన్ వినియోగించాలనుకునేవారు అవసరం మేరకు మాత్రమే ఫోన్‌ను వినియోగించాలి.