ప్రధాని మోదీ ట్రినిడాడ్ & టొబాగో పర్యటన పూర్తి చేసుకుని అర్జెంటీనా వెళ్లారు. ఆయన రాక కోసం అక్కడి భారత సంతతి ప్రజలతో పాటు అర్జెంటీనా కళాకారులు కూడా ఎదురుచూస్తున్నారు. ప్రధానికి స్వాగతం చెప్పేందుకు ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొనబోతున్న ఆర్టిస్టులు మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ సంప్రదాయ నృత్యాలతో స్వాగతించడం ఎంతో గర్వంగా భావిస్తున్నామని, ఇది తమకు గొప్ప అవకాశం అని తెలిపారు.