భార్య తనతో గొడవ పడిందనే మనస్థాపంతో ఓ వ్యక్తి తన నలుగురు చిన్నారులతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన మనోజ్ మహతో(45)కు తన భార్య ప్రియతో మంగళవారం గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన మనోజ్ తమ పిల్లలు పవన్(10), కరు(9), మురళి(5), చోటు(3)లను పార్కుకు తీసుకెళ్తున్నానని చెప్పాడు. వారికి కావాల్సిన డ్రింక్స్, చిప్స్ కొనిచ్చి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.