పొలాల్లో ఆర్మీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

62చూసినవారు
పొలాల్లో ఆర్మీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. వారం క్రితం విజయవాడలో వదర సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆర్మీ హెలికాప్టర్ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయింది. ఈ క్రమంలోనే మార్గమధ్యలో హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్ వ్యవసాయ పొలంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్