భార్య చివరి చూపునకు నోచుకోని ఆర్మీ జవాన్

72చూసినవారు
భార్య చివరి చూపునకు నోచుకోని ఆర్మీ జవాన్
ఆపరేషన్ సిందూర్‌తో కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాలను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. సెలవులపై ఉన్నవారిని సైతం బార్డర్‌కు రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒడిశాకు చెందిన దేబ్రాబ్ అనే జవాన్ భార్య చివరి చూపునకు నోచుకోలేకపోయాడు. 15 రోజుల క్రితం భార్య ప్రసవించగా.. ఆమె అనారోగ్యం పాలైంది. ఆర్మీ నుంచి పిలుపు రావడంతో విధుల్లో చేరాడు. అనంతరం భార్య మరణించగా.. దేబ్రాబ్ అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు. ఈ ఘటన అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.

సంబంధిత పోస్ట్