ఆరోగ్య శ్రీ బకాయిలు వెంటనే చెల్లించాలి: హరీశ్ రావు

83చూసినవారు
ఆరోగ్య శ్రీ బకాయిలు వెంటనే చెల్లించాలి: హరీశ్ రావు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం పేద ప్రజలకు శాపంగా మారిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయని ట్వీట్ చేశారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. నెట్వర్క్ ఆస్పత్రుల డిమాండ్లు పరిష్కరించి, పెండింగ్ బకాయిలు చెల్లించి ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగేలా చూడాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్