గురుకులాల సమస్యలపై ప్రశ్నించిన బీఆర్ఎస్పీ నాయకులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ అన్నారు. 'ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులా? పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? నిన్న అరెస్ట్ చేసిన మా విద్యార్థి నాయకుల జాడ నేటికీ చెప్పకుండా రాత్రంతా తిప్పుతారా? వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ' అని Xలో ట్వీట్ చేశారు.