BRS MLA సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. నల్లవల్లి, ప్యారానగర్‌లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలను కలిసేందుకు వెళితే అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని ఫైర్ అయ్యారు. MLAతో పాటు పార్టీ నేతలను, అక్రమంగా నిర్బంధించిన అమాయకులైన ప్రజలను బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.