గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్లు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపురం గ్రామానికి చెందిన శేఖర్, నరేష్ జడ్చర్ల మండలం మల్లబోయినపల్లి గ్రామానికి చెందిన భాను ప్రసాద్ కలిసి వ్యసనాలకు బానిసై సీలేరు నుంచి గంజాయిని తెచ్చి గజ్వేల్‌లో అమ్మేవారు. సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టి వారిని పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు.