రామ్‌దేవ్‌ బాబాపై అరెస్ట్‌ వారెంట్‌

85చూసినవారు
రామ్‌దేవ్‌ బాబాపై అరెస్ట్‌ వారెంట్‌
యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు రాందేవ్‌ బాబాకు భారీ షాక్ తగిలింది. పతంజలికి చెందిన దివ్య ఫార్మసీ వైద్యవిధానాలపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు ప్రచారాల కేసులో ఆయనకు చుక్కెదురైంది. సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణతో సహా రాందేవ్ బాబాపై కేరళ హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్‌ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో విచారణకు ఫిబ్రవరి 1న హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించగా వారు హాజరు కాకపోవడంతో అరెస్ట్‌ వారెంట్ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్