ప్రముఖ నటుడు సోనూసూద్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మోహిత్ శర్మ అనే వ్యక్తి తనకు రూ.10 లక్షలు మోసం చేశాడని న్యాయవాది రాజేశ్ ఖన్నా కేసు వేశారు. ఈ కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి సోనూ రాకపోవడంతో పంజాబ్‌లోని లుథియానా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. సోనూసూద్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేసు ఈ నెల 10న మరోసారి విచారణకు రానుంది.