AP: వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని.. టీడీపీ మంత్రి కొల్లు రవీంద్రపై శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ వేసే గింజలు కోసం, మూటల్లో నుంచి జారిపడే నోట్ల కోసం రవీంద్ర ఆరాటపడుతున్నారని నాని అన్నారు. విజయవాడ జైలులో వల్లభనేని వంశీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనను అరెస్ట్ చేయిస్తానంటూ 9 నెలలుగా అంటున్నాడని.. అరెస్టులతో ఒరిగేది ఏం లేదని, నా చేతి మీద రోమాలు కూడా ఊడవని ఆయన కౌంటర్ ఇచ్చారు.